రౌడీషీట్‌ తెరవకుండా లంచం

జూదశిబిరం నిర్వహించిన స్థల యజమానిపై రౌడీషీట్‌ తెరవకుండా ఉండేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం సీఐ ఆంజనేయులు శనివారం  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

Published : 26 May 2024 04:40 IST

ఏసీబీకి చిక్కిన సీఐ ఆంజనేయులు

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: జూదశిబిరం నిర్వహించిన స్థల యజమానిపై రౌడీషీట్‌ తెరవకుండా ఉండేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం సీఐ ఆంజనేయులు శనివారం  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో గత నెల 16న కోడి పందేలు, జూద శిబిరాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టుచేశారు. ఈ క్రమంలో స్థల యజమాని కుంచర్లపాటి లక్ష్మణరాజుపై రౌడీ షీట్‌ తెరవకుండా ఉండేందుకు సీఐ.. రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో లక్ష్మణరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. సీఐ ఆంజనేయులు రావులపాలెం పోలీసుస్టేషన్‌లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని