నేడు రేవ్‌ పార్టీ నిందితుల విచారణ.. నటి హేమ సహా 8 మందికి నోటీసులు

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో అయిదుగురి బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ప్రధాన నిందితుడు లంకిపల్లి వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు.

Published : 27 May 2024 06:16 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో అయిదుగురి బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ప్రధాన నిందితుడు లంకిపల్లి వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. వారి ఖాతాలకు వచ్చిన నగదు వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు న్యాయస్థానంలో సోమవారం పోలీసులు పిటిషన్‌ వేయనున్నారు. రేవ్‌ పార్టీలో 103 మంది పాల్గొనగా, వారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. వారిలో నటి హేమతో కలిపి ఎనిమిది మందిని సోమవారం విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని అరికట్టకపోతే కర్ణాటక మరో పంజాబ్‌గా మారిపోతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. బెంగళూరు, మంగళూరు, హుబ్బళ్లి ప్రాంతాల్లో డ్రగ్‌ మాఫియా వేళ్లూనుకోవడం, రేవ్‌ పార్టీల సంఖ్య పెరగడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని దుయ్యబట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు