13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగుబాటు

ఎదురుకాల్పులు, లొంగిపోవడం, అరెస్టులతో పెదబయలు ఏరియా మావోయిస్టు కమిటీ పూర్తిగా బలహీనపడిందని.. దీంతో వారికి సహకారం అందించే మిలీషియా సభ్యులు లొంగిపోతున్నారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా పేర్కొన్నారు.

Published : 27 May 2024 05:39 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా. చిత్రంలో పోలీసు అధికారులు, లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఎదురుకాల్పులు, లొంగిపోవడం, అరెస్టులతో పెదబయలు ఏరియా మావోయిస్టు కమిటీ పూర్తిగా బలహీనపడిందని.. దీంతో వారికి సహకారం అందించే మిలీషియా సభ్యులు లొంగిపోతున్నారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా పేర్కొన్నారు. పాడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని గిన్నెలకోటకు చెందిన పెదబయలు ఏరియా కమిటీలో 13 మంది మిలీషియా సభ్యులు తమ ముందు లొంగిపోయారని వెల్లడించారు. వారిలో కిల్లు సింహాద్రి, వంతాల నగేష్, రాంబాబు, పాంగి పిల్కునాయుడు, కిల్లు చిరంజీవి, దొన్నుబాబు, గంటా మోహన్‌రావు, గడుతూరు పంతులు పడాల్, మనుగూరు నాగరాజు, చిక్కుడు రామ్మూర్తి, గణేష్‌ అలియాస్‌ గన్నేరావు, పాంగి పల్సు అలియాస్‌ టింగు, రామదాసు ఉన్నారని తెలిపారు. వీరంతా గత పదేళ్ల నుంచి మావోయిస్టులకు భోజనాలు ఏర్పాటు చేయడం, వారికి సామగ్రి ఇతర సహకారాలు అందించేవారన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందేలా సహకరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్, ఏఎస్పీ ధీరజ్, జి.మాడుగుల సీఐ రమేష్, పెదబయలు ఎస్సై మనోజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని