ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో దంపతులు దుర్మరణం పాలైన ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని ట్విల్స్‌ అవుట్‌లెట్‌లో పనిచేసే షేక్‌ మునీర్‌బాషా(59) గుంటూరు జిల్లా మంగళగిరి తిప్పళ్లబజారులో కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నారు.

Published : 27 May 2024 05:42 IST

అదుపు తప్పి బైకును ఢీకొట్టడంతో దంపతుల దుర్మరణం

మృతులు షేక్‌ మునీర్‌బాషా, జరీనా పర్వీన్‌ 

కృష్ణలంక, న్యూస్‌టుడే: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో దంపతులు దుర్మరణం పాలైన ఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని ట్విల్స్‌ అవుట్‌లెట్‌లో పనిచేసే షేక్‌ మునీర్‌బాషా(59) గుంటూరు జిల్లా మంగళగిరి తిప్పళ్లబజారులో కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నారు. ఆదివారం భార్య జరీనా పర్వీన్‌(49)తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి తిరిగి వస్తూ.. సుమారు 7.30 సమయంలో రాజీవ్‌గాంధీ పార్కు సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో మితిమీరిన వేగంతో పైవంతెన నుంచి వచ్చిన సాయి మారుతీ గోపీచంద్‌ ట్రావెల్స్‌ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. తర్వాత అదుపుతప్పి.. పక్కనే వెళ్తున్న బాషా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న బాషా దంపతులు కిందపడ్డారు. వారిపై నుంచి బస్సు వెళ్లిపోయింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆ తర్వాత బస్సు మరికొన్ని వాహనాల్ని ఢీకొట్టి నిలిచిపోయింది.  డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు వివరాలు సేకరించి బస్సును స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని