ప్రాణాలు తీసిన అతివేగం.. చిన్నారి సహా ఆరుగురి మృతి

కర్ణాటక రాష్ట్రం హాసన నగర శివారు ఈచనహళ్లి వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మరణించారు. మంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, మరో వైపునకు పల్టీ కొట్టింది.

Published : 27 May 2024 04:57 IST

హాసన, న్యూస్‌టుడే:  కర్ణాటక రాష్ట్రం హాసన నగర శివారు ఈచనహళ్లి వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మరణించారు. మంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, మరో వైపునకు పల్టీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న కంటెయినర్‌ లారీని ఢీకొనడంతో..చిక్కబళ్లాపుర సమీపంలోని కారళ్లి, అందరహళ్లి గ్రామాలకు చెందిన నారాయణప్ప (55), సునంద (52)దంపతులు.. వారి కుమారుడు రవికుమార్‌ (30), కోడలు నేత్ర (28), మనవడు చేతన్‌ (4), కారు డ్రైవరు రాకేశ్‌ (35) అక్కడికక్కడే మృతిచెందారు. నారాయణప్పకు మంగళూరులో చికిత్స ఇప్పించి, తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని