బంద్‌ నేపథ్యంలో మావోయిస్టుల విధ్వంసం

ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఆ రాష్ట్రంలో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణ సరిహద్దులో పలు ఘటనలకు పాల్పడ్డారు.

Published : 27 May 2024 05:04 IST

రహదారికి అడ్డంగా మావోయిస్టులు వేసిన చెట్లు

చర్ల, న్యూస్‌టుడే: ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఆ రాష్ట్రంలో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణ సరిహద్దులో పలు ఘటనలకు పాల్పడ్డారు. బీజాపుర్, సుక్మా, దంతెవాడ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణను కలిపే పూసుగుప్ప-వద్దిపేట రహదారిలో భారీ వృక్షాలను నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. వద్దిపేట సమీపంలోని రోటెంతవాగు వంతెన వద్ద వృక్షాలను నరికి పడేసి భారీగా మంటలు పెట్టగా వారధి పాక్షికంగా బీటలు వారింది. నాలుగు విద్యుత్తు స్తంభాలను ధ్వంసం చేశారు. మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్‌జోనల్‌ కమిటీ పేరిట కరపత్రాలు వెలిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని