యూపీలో రెండు రోడ్డు ప్రమాదాలు.. 17 మంది దుర్మరణం..

ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో మొత్తం 17 మంది చనిపోయారు. మరో 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పూర్ణగిరి ఆలయానికి 59 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ట్రక్‌ డంపర్‌ బోల్తాపడింది.

Published : 27 May 2024 05:29 IST

మరో 17 మందికి గాయాలు
బస్సుపై డంపర్‌ ట్రక్‌ బోల్తా

షాజహన్‌పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో మొత్తం 17 మంది చనిపోయారు. మరో 17 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పూర్ణగిరి ఆలయానికి 59 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై ట్రక్‌ డంపర్‌ బోల్తాపడింది. షాజహాన్‌పుర్‌ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుసుకుంది. 12 మంది మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు భోజనం చేసేందుకు ఓ హోటల్‌ ముందు బస్సు ఆపగా.. ట్రక్‌ వచ్చి ఢీ కొట్టి బస్సు మీద పడిందని వివరించారు. క్షతగాత్రులంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌ జిల్లా కమ్లాపుర్‌ గ్రామానికి చెందినవారని పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం వ్యక్తంచేశారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందిచాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. మరో ఘటనలో లఖింపుర్‌-బహ్‌రైచ్‌ రహదారిపై బస్సును వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఐదుగురు మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిలో ఆరగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని