రాజ్‌కోట్‌ ప్రమాదంలో ఆరుగురిపై కేసు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగరం టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో శనివారం జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో 300 మందికి పైగా ప్రజలు గేమ్‌జోన్‌లో ఉన్నారని రాజ్‌కోట్‌ అగ్నిమాపక విభాగ అధికారి ఇలేష్‌ ఖేర్‌ తెలిపారు.

Published : 27 May 2024 05:33 IST

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అగ్నిప్రమాదం కారణంగా ధ్వంసమైన గేమ్‌జోన్‌

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగరం టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో శనివారం జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో 300 మందికి పైగా ప్రజలు గేమ్‌జోన్‌లో ఉన్నారని రాజ్‌కోట్‌ అగ్నిమాపక విభాగ అధికారి ఇలేష్‌ ఖేర్‌ తెలిపారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయని వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపామన్నారు. మృతి చెందిన 27 మందిలో 12 ఏళ్ల వయసు లోపు చిన్నారులు నలుగురు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మంటలు చెలరేగుతున్న సమయంలో కొందరు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలతో బయట పడ్డారు. అగ్ని ప్రమాదం కేసును గుజరాత్‌ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం సుమోటోగా విచారణకు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని