పల్నాడు అల్లర్ల కేసులో కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు

పల్నాడు జిల్లాలో పోలింగ్‌నాడు జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్న పది మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 28 May 2024 04:50 IST

పది మంది అరెస్టు.. రిమాండ్‌ 

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలింగ్‌నాడు జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్న పది మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో నరసరావుపేట టూటౌన్‌ పరిధిలో ఐదుగురు, రెంటచింతల ఠాణా పరిధిలో ఐదుగురు ఉన్నారు. జిల్లాలో సోమవారం కూడా సిట్‌ విచారణ కొనసాగింది. నరసరావుపేట టూటౌన్‌ పరిధిలో మూడు చోట్ల అల్లర్లు చోటు చేసుకోవడం, నిందితులు ఎక్కువగా ఉండటంతో గుర్తింపు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాచర్ల 22వ వార్డులో మహిళ లీలావతిపై దాడి సంఘటనలో నిందితుడు, వైకాపా కార్యకర్త ఉప్పునూతల వెంకటేశ్‌ ఆచూకీ తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ వెల్దుర్తి మండలం కండ్లకుంటకు చెందిన తెదేపా కార్యకర్త నోముల మాణిక్యరావు ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అది వెల్దుర్తి స్టేషన్‌కు ఇంకా అందలేదని మాచర్ల గ్రామీణ స్టేషన్‌ సీఐ సురేష్‌యాదవ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు