రాళ్లదాడి కేసులో మరో అయిదుగురి అరెస్టు

పోలింగ్‌ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రిలో.. వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడికి సంబంధించిన కేసులో మరో అయిదుగురిని పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Published : 28 May 2024 04:51 IST

తాడిపత్రి, న్యూస్‌టుడే: పోలింగ్‌ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రిలో.. వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడికి సంబంధించిన కేసులో మరో అయిదుగురిని పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వైకాపాకు చెందిన వాల్మీకి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సజ్జలదిన్నె రాజు, కార్యకర్త గౌస్‌ మహమ్మద్‌.. తెదేపా  వర్గీయులు గోకుల్‌ మహేశ్, పేరం రవి, నాగేంద్ర గౌడ్‌ ఉన్నారని ఎస్సై గౌస్‌బాషా వెల్లడించారు. ఇప్పటివరకు 113 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని