334 కిలోల గంజాయి పట్టివేత

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు 334 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Published : 28 May 2024 04:52 IST

కొయ్యూరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు 334 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు మండలం చీడిపాలెం కూడలిలో పోలీసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. బూదరాళ్ల వైపు నుంచి రెండు ద్విచక్రవాహనాలు, ఒక ఆటోలో గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన లైచన్‌ తంగుల్, బాసుదేబ్‌ తంగుల్, పెదబయలు మండలం బోయరాజులు గ్రామానికి చెందిన బోండా ప్రభాకర్, జర్సింగి గంతన్న, గల్లెలి రామారావు, జర్సింగి సంతోష్‌లను అరెస్టు చేశారు. 

చింతపల్లి మండలం లోతుగెడ్డ వంతెన వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో 124 కేజీల గంజాయి పట్టుబడింది. రెండు ఆటోల్లో గంజాయి తరలిస్తున్న రాళ్లగెడ్డ గ్రామానికి చెందిన కిల్లో కేశవరావు, మేడూరు గ్రామానికి చెందిన సీందరి నాని, కప్పగొంది గ్రామానికి చెందిన పాలికి కొండబాబును అదుపులోకి తీసుకున్నట్లు అన్నవరం ఎస్సై రాజారావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని