తూప్రాన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ అరెస్టు

నకిలీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేశారనే కేసులో మంగళవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 29 May 2024 04:05 IST

మనోహరాబాద్, న్యూస్‌టుడే: నకిలీ ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేశారనే కేసులో మంగళవారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మనోహరాబాద్‌ ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ మోతీ నగర్‌కు చెందిన సత్యనారాయణమూర్తి, ఆయన భార్య స్వాతి మనోహరాబాద్‌ మండలం కూచారం శివారులో కొన్నేళ్ల కిందట 1000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు అరుణ్‌ కుమార్, మరో ఏడుగురు కలిసి నకిలీ పత్రాలు సృష్టించి రూ.80 లక్షలకు ఆయనకు విక్రయించారు. అప్పటికే ఆ భూమి దుర్గ అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్‌ అయింది. అయితే నిందితులు హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన లక్ష్మికి డబ్బు ఎర చూపి ఆమె ఆధార్‌ కార్డును దుర్గగా మార్ఫింగ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయితే సత్యనారాయణ లింక్‌ డాక్యుమెంట్లను అడగ్గా అమ్మిన వ్యక్తులు కాలయాపన చేస్తూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. చివరకు ఆయన ప్లాట్‌ వద్దకు వెళ్లగా ఆ స్థలం వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండడంతో అసలు విషయం తెలిసింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు గత నెలలో మనోహరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తూప్రాన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ సనత్‌నగర్‌ రమణ, పిట్ల సాయి కుమార్, వేముల ప్రభాకర్, లక్ష్మి, డాక్యుమెంట్‌ రైటర్‌ బాలకృష్ణను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని