వైద్యారోగ్య శాఖలో లైంగిక వేధింపులు

లైంగిక వేధింపుల కేసులో రాష్ట్ర ప్రజారోగ్యశాఖలో విధులు నిర్వహించిన ఆఫీసు సూపరింటెండెంట్‌ మహమ్మద్‌ సలావుద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ బి.రవీందర్‌నాయక్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 29 May 2024 04:07 IST

ప్రజారోగ్యశాఖ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

ఈనాడు, హైదరాబాద్‌ : లైంగిక వేధింపుల కేసులో రాష్ట్ర ప్రజారోగ్యశాఖలో విధులు నిర్వహించిన ఆఫీసు సూపరింటెండెంట్‌ మహమ్మద్‌ సలావుద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ బి.రవీందర్‌నాయక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై వేధింపులకు పాల్పడినట్లు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన స్టాఫ్‌ నర్సు ఫిర్యాదు చేయడంతో పాటు.. సరూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో సలావుద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్యశాఖ రాష్ట్ర కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సలావుద్దీన్‌ చర్యలపై ఫిర్యాదు రావడంతో ఆయనను ఇటీవల రాష్ట్ర ఆరోగ్య రవాణా విభాగానికి బదిలీచేశారు. తాజాగా ఆయనను సస్పెండ్‌ చేశారు. అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్‌ను వీడిపోకూడదని డీహెచ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌సింగ్‌ సస్పెండ్‌ అయ్యారు. డీహెచ్‌ కార్యాలయంలో మరో ఇద్దరు కీలక ఉద్యోగులపై అంతర్గతంగా విచారణ కొనసాగుతోందని విశ్వసనీయ సమాచారం. మరికొందరు ఉద్యోగులపై ఆరోపణలు వస్తున్నా, ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖలో వరుసగా చోటు చేసుకుంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని