రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

తమిళనాడుకు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను చిత్తూరు అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

Published : 29 May 2024 06:02 IST

నిందితుడు, ఎర్రచందనం దుంగలను చూపుతున్న డీఎఫ్‌ఓ చైతన్యకుమార్‌రెడ్డి

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తమిళనాడుకు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను చిత్తూరు అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎఫ్‌ఓ చైతన్యకుమార్‌రెడ్డి చిత్తూరులో వెల్లడించారు. స్మగ్లర్ల సమాచారం తెలుసుకున్న తూర్పు విభాగం రేంజ్‌ అధికారి థామస్‌ ఆధ్వర్యంలోని బృంద అధికారులు, సిబ్బంది వారిని రహస్యంగా వెంబడించారు. మంగళవారం వేకువజామున స్మగ్లర్లు శ్రీనివాస మంగాపురం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి దుంగలను వాహనంలో లోడ్‌ చేసుకుని తమిళనాడులోని వేలూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో అధికారులు వారి వాహనాన్ని ఆపాలని చూడగా గ్రహించిన నిందితులు వాహనాన్ని వెనక్కు మళ్లించి తప్పించుకునేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించారు. దుండగులు వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. రంగంపేట క్రాస్‌ వద్ద ఇద్దరు కారు దూకి పారిపోగా, తిరువణ్నామలై జిల్లా కుటకరై ప్రాంతానికి చెందిన గోవిందరాజులను, దుంగలతో సహా వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దుంగల బరువు నాలుగు టన్నులు ఉందని డీఎఫ్‌ఓ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని