చార్‌ధామ్‌ యాత్రలో విషాదం

ఉత్తర భారత ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన వరంగల్‌ నగరవాసి బస్సు బోల్తా పడడంతో మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 30 May 2024 05:21 IST

బస్సు బోల్తాపడి వరంగల్‌ వాసి  మృతి.. పలువురికి గాయాలు

పోచమ్మమైదాన్, న్యూస్‌టుడే: ఉత్తర భారత ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన వరంగల్‌ నగరవాసి బస్సు బోల్తా పడడంతో మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న వరంగల్‌ జిల్లా పోచమ్మమైదాన్‌ ఏకశిలానగర్‌కు చెందిన 8 మంది సభ్యులు ఉత్తరాఖండ్‌ చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లారు. పర్యటన ముగించుకుని కేదార్‌నాథ్‌ నుంచి హరిద్వార్‌ వస్తుండగా.. బుధవారం ఉదయం వారు ప్రయాణిస్తున్న బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో రిషికేశ్‌- బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ప్రమాదంలో ఏకశిలానగర్‌కు చెందిన నార్ల బాలరాజు(69) తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న గణేశ్, సంధ్యారాణి, శ్రీలత, రాజు, జయప్రద తీవ్రంగా గాయపడ్డారు. స్థానికంగా కిరాణం షాపు నిర్వహించే బాలరాజుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని