‘మైన్స్‌’ ఫైల్స్‌ తగలబెట్టేశారు!.. చిత్తూరులో దుండగుల దుశ్చర్య

చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లోపలి వస్తువులను చిందరవందర చేసి, పలు దస్త్రాలకు నిప్పు పెట్టారు.

Updated : 05 Jun 2024 06:54 IST

ప్రైవేటు కార్యాలయం వెలుపల కాలుతున్న ఫైల్స్‌ 

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లోపలి వస్తువులను చిందరవందర చేసి, పలు దస్త్రాలకు నిప్పు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కూటమి విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలోనే కీలకమైన ఫైల్స్‌కు నిప్పు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునే ప్రైవేటు సంస్థలు కొన్ని ఇసుక, గనుల నుంచి ఖనిజాలు, గ్రానైట్‌ తదితరాల రవాణాకు సంబంధించి ట్రాన్సిట్‌ పాస్‌లు, రాయల్టీలు వసూలు చేస్తుంటారు. స్థానికంగా ఇలాంటి అనుమతులన్నీ అక్రమంగా సాగుతున్నాయని, ప్రభుత్వం మారాక దస్త్రాలు పరిశీలిస్తే లొసుగులు బయటపడతాయనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యాలయం తెలంగాణకు చెందిన ఒక మంత్రికి సంబంధించినదని తెలుస్తోంది. దస్త్రాల కాల్చివేతపై కేసు నమోదు చేశామని, 30 మంది ఆగంతకులు చొరబడి లోపల ధ్వంసం చేసి నిప్పు పెట్టారని చిత్తూరు వన్‌టౌన్‌ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని