అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో అప్పుల బాధతో బుధవారం ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 06 Jun 2024 05:46 IST

గీసుకొండ, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో అప్పుల బాధతో బుధవారం ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాలకు చెందిన గడ్డమీది అశోక్‌ (43) ఓ రైతుకు చెందిన రెండున్నర  ఎకరాలు కౌలుకు తీసుకొని ఐదేళ్లుగా పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగుచేస్తున్నారు. ఆశించిన దిగుబడులు రాక.. రూ.6 లక్షల వరకూ అప్పుల పాలయ్యారు. ఈ బాధతో వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని