హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన నలుగురి మృతి

హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన నలుగురు పర్యాటకులు మృత్యువాత పడినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లా కలెక్టర్‌ మెహర్‌బాన్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు.

Published : 06 Jun 2024 04:50 IST

చిక్కుకుపోయిన 18 మంది

ఉత్తర్‌కాశీ: హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన నలుగురు పర్యాటకులు మృత్యువాత పడినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లా కలెక్టర్‌ మెహర్‌బాన్‌ సింగ్‌ బుధవారం వెల్లడించారు. మరో 18 మంది అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. 22 మందితో కూడిన ఈ పర్వతారోహకుల బృందం మే 29న 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్త్రతాల్‌ సరస్సుకు బయలుదేరింది. వీరిలో 18 మంది కర్ణాటకకు చెందిన వారు కాగా ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చారు. మరో ముగ్గురు స్థానిక గైడ్‌లు తోడుగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు. మనేరీలో ఉన్న ఓ పర్యాటక ఏజెన్సీ సాయంతో ఈ బృందం ఈ 35 కి.మీ. ట్రెక్కింగ్‌ను ఉత్తర్‌కాశీ నుంచి ప్రారంభించింది. వీరు ఈ నెల 7న తిరిగి రావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వారిలో నలుగురు చనిపోగా.. మిగిలిన వారు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిసింది. బాధితులకు సాయం అందించడానికి సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు