రూ.130 కోట్ల కొకైన్‌ స్వాధీనం

గుజరాత్‌లోని కచ్‌ జిల్లా గాంధీదామ్‌ పట్టణ సమీపంలోని క్రిక్‌ ప్రాంతంలో రూ.130 కోట్ల విలువైన 13 కొకైన్‌ ప్యాకెట్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 06 Jun 2024 04:50 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని కచ్‌ జిల్లా గాంధీదామ్‌ పట్టణ సమీపంలోని క్రిక్‌ ప్రాంతంలో రూ.130 కోట్ల విలువైన 13 కొకైన్‌ ప్యాకెట్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఇదే ప్రాంతం నుంచి ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్‌ పట్టుకోవడం రెండోసారని కచ్‌ ఈస్ట్‌ డివిజన్‌ ఎస్పీ సాగర్‌ బాగ్మర్‌ వెల్లడించారు. కాగా గతేడాది సెప్టెంబరులో క్రిక్‌ ప్రాంతంలో స్మగ్లర్లు దాచిన 80 కొకైన్‌ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని