మానవ అక్రమ రవాణా కేసులో లోతైన దర్యాప్తు

కాంబోడియా మానవ అక్రమ రవాణా ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ తెలిపారు. ఆ దేశంలో ఉన్న పలు చైనా సంస్థల దగ్గర 158 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు.

Published : 07 Jun 2024 06:18 IST

కాంబోడియా నుంచి 68 మంది బాధితుల రాక
విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌

బాధితులతో కలిసి సమావేశంలో మాట్లాడుతున్న సీపీ రవిశంకర్‌

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: కాంబోడియా మానవ అక్రమ రవాణా ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ తెలిపారు. ఆ దేశంలో ఉన్న పలు చైనా సంస్థల దగ్గర 158 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 68 మందిని సురక్షితంగా తీసుకురాగా మరో 25 మంది స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ ‘ఈ కేసులో దేశవ్యాప్తంగా 21 మంది ఏజెంట్లు ఉన్నారు. వీరిలో ఓ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశాం. కంపెనీల పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలను సరఫరా చేస్తున్న వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం. ఆరుగురు ఏజెంట్లపై లుక్‌ అవుట్ సర్టిఫికెట్లను జారీ చేశాం’ అని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులంటూ మభ్యపెట్టి కాంబోడియా ముఠా విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి రూ.46 లక్షలు, ఒక వ్యాపారి నుంచి రూ.1.12 కోట్ల పెట్టుబడులను పెట్టించి మోసం చేసిందని సీపీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని