వాగులో ఒరిగిన బస్సు... తప్పిన ప్రమాదం

లో లెవల్‌ వంతెనపై వెళ్తున్న బస్సు వరదకు కొట్టుకుపోయి.. పక్కనున్న పొలంలోకి దిగడంతో డ్రైవర్‌ అతికష్టం మీద ఆపి.. ప్రయాణికులు ఒడ్డుకు చేరేలా చేశారు.

Published : 07 Jun 2024 06:19 IST

పాలేరు వాగులో ఒరిగిన కోవెలకుంట్ల ఆర్టీసీ బస్సు 

సంజామల, న్యూస్‌టుడే: లో లెవల్‌ వంతెనపై వెళ్తున్న బస్సు వరదకు కొట్టుకుపోయి.. పక్కనున్న పొలంలోకి దిగడంతో డ్రైవర్‌ అతికష్టం మీద ఆపి.. ప్రయాణికులు ఒడ్డుకు చేరేలా చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లా సంజామల మండలంలో చోటుచేసుకొంది. కోవెలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం తెల్లవారు జామున 5 గంటలకు వైఎస్సార్‌ జిల్లా పెద్దముడియం మండలంలోని కొండసుంకేసుల గ్రామం నుంచి కోవెలకుంట్లకు బయల్దేరింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి సంజామల సమీపంలో పాలేరు వాగు పొంగుతోంది. ప్రవాహాన్ని అంచనా వేయకుండా డ్రైవర్‌ బస్సును ముందుకు పోనిచ్చారు. వంతెన మీద కొద్దిదూరం వెళ్లగానే ప్రవాహానికి బస్సు నెమ్మదిగా కొట్టుకుపోసాగింది. బస్సు కుడివైపు చక్రాలు వంతెన దిగి పొలంలో దిగబడ్డాయి. డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేకులు వేసి అందులోని ప్రయాణికులు దిగిపోవాలని సూచించారు. 13 మంది ప్రయాణికులు ఒకరినొకరు పట్టుకొని బస్సు దిగి స్థానికుల సాయంతో ఒడ్డుకు చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు