నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంటులో పనిలోకి!

నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంటు ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులకు వచ్చిన ముగ్గురిని మంగళవారం సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.

Published : 07 Jun 2024 05:36 IST

ముగ్గురిని అరెస్టుచేసిన భద్రతా సిబ్బంది

దిల్లీ: నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంటు ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులకు వచ్చిన ముగ్గురిని మంగళవారం సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కసిం, మోనిస్, షోయబ్‌లను అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురిని డీ వీ ప్రాజెక్ట్స్‌ కంపెనీ నిర్మాణ పనుల్లో నియమించుకుంది. ఎంపీ లాంజ్‌ల నిర్మాణ పనుల కోసం ఆ ముగ్గురు నకిలీ ఆధార్‌ కార్డులతో పార్లమెంటు ఆవరణలోకి వచ్చారు. సీఐఎస్‌ఎఫ్‌ తనిఖీల సమయంలో ఆధార్‌ కార్డులు నకిలీవని తేలింది. దీంతో వారిని అరెస్టు చేసి దిల్లీ పోలీసులకు అప్పగించారు. ముగ్గురిపై ఫోర్జరీ, మోసం, నేరపూరిత్ర కుట్ర కేసులను పోలీసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని