కోటాలో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌ పరీక్ష శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నీట్‌(యూజీ) ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.

Published : 07 Jun 2024 05:37 IST

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌ పరీక్ష శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నీట్‌(యూజీ) ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాకు చెందిన బాగీషా(18) కుటుంబంతో కలిసి కోటా జవహర్‌నగర్‌లోని ఓ భవనంలో నివాసముంటోంది. గత మూడేళ్లుగా నీట్‌కు సన్నద్ధమవుతోన్న తను మంగళవారం వెలువడిన ఫలితాల్లో 720కు గాను 320 మార్కులు సాధించింది. బుధవారం తరగతులకు హాజరైన అనంతరం తాను నివాసం ఉంటోన్న భవనంలోని 9వ అంతస్తుపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన బాగీషాను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతిచెందింది. తక్కువ మార్కులు రావడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు