ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపుర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం మావోయిస్టు దళాలకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Published : 08 Jun 2024 05:05 IST

ముగ్గురు జవాన్లకు గాయాలు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపుర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం మావోయిస్టు దళాలకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు ముంగేడు గ్రామ శివారులోని గోబెల్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపడుతుండగా. మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. బలగాలు ప్రతిఘటించడంతో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలంలో వారి మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టులను గుర్తించేందుకు పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు సైతం గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు