సహజీవనం వద్దన్నందుకు.. ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

కుటుంబ పెద్దలు తమ సహజీవనాన్ని వద్దన్నారని ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నం చేయగా ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో శుక్రవారం జరిగింది. బయ్యారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

Published : 08 Jun 2024 05:05 IST

కురవి, న్యూస్‌టుడే: కుటుంబ పెద్దలు తమ సహజీవనాన్ని వద్దన్నారని ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నం చేయగా ఒకరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో శుక్రవారం జరిగింది. బయ్యారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కురవి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (22) ఇంటర్మీడియట్‌ వరకు చదివి ఇంట్లో ఉంటూ కూలి పనులకు వెళుతోంది. వారిద్దరికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. సహజీవనం చేయాలనే ఉద్దేశంతో నెల రోజుల క్రితం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌ వెళ్లారు. పదిహేను రోజుల తరువాత కురవి మండలానికి చెందిన యువతి సెల్‌ఫోన్‌లో తన సోదరుడితో మాట్లాడింది. తాను స్నేహితురాలితో కలిసి ఉంటున్నానని... తన కోసం ఎవరూ వెతకవద్దని కుటుంబసభ్యులను కోరింది. ఈనెల 1న కుటుంబసభ్యులు వెళ్లి ఇద్దరినీ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తరువాత కురవి మండలానికి చెందిన యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మరో యువతి కూడా పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వారిని  మహబూబాబాద్‌ జిల్లా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా... కురవి మండలానికి చెందిన యువతి గురువారం రాత్రి మృతి చెందింది. మరో యువతికి స్వస్థత చేకూరగా శుక్రవారం ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని