వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి!

జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం ఫత్తేపూర్‌ శివారు లూనావత్‌ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.

Published : 09 Jun 2024 05:18 IST

చిల్పూర్, న్యూస్‌టుడే: జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం ఫత్తేపూర్‌ శివారు లూనావత్‌ తండాలో శనివారం వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. తండాకు చెందిన గుగులోత్‌ మధు, సరిత దంపతుల రెండో కుమారుడు గుగులోత్‌ అభిరామ్‌ (6)ను తల్లిదండ్రులు ఇంటి వద్ద వదిలి పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమారుడు ఇంటి వద్ద లేకపోవడంతో గ్రామంలో వెతుకుతుండగా.. శివారులోని పొలంలో మృతి చెంది కనిపించాడు. గ్రామంలో గుంపులుగా ఉన్న వీధి కుక్కలు.. ఆడుకుంటున్న బాలుడిని తీవ్రంగా కరిచి, పొలంలోకి లాక్కెళ్లి ఉంటాయని ఆనవాళ్లను బట్టి అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీనిపై పోలీసు కేసు నమోదు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని