ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది నక్సలైట్ల అరెస్ట్‌

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాకు చెందిన వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

Published : 10 Jun 2024 04:44 IST

బీజాపుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాకు చెందిన వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఇందులో 8 మందిని ఉసూర్‌ పోలీసు స్టేషను పరిధిలో పలుచోట్ల అరెస్టు చేయగా, మరొకరిని నైమేడ్‌ ఠాణా పరిధిలో అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారందరూ చట్టవిరుద్ధమైన మావోయిస్టు ఉద్యమంలో మిలీషియా సభ్యులుగా క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు