బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య కేసులో పురోగతి

పశ్చిమ బెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనార్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Published : 10 Jun 2024 05:13 IST

కాలువలో మానవ శరీర భాగాలు లభ్యం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనార్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం పోలీసులు కాశీనగర్‌ ప్రాంతంలోని ఓ కాలువలో మానవ ఎముకలను గుర్తించారు. ఈ కేసులో నేపాల్‌ నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చిన మహమ్మద్‌ సియామ్‌ హుస్సేన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు చేపట్టిన గాలింపులో బాధితుడివిగా భావిస్తున్న శరీర భాగాల ఎముకలు లభ్యమయ్యాయి. ‘‘వైద్యులు, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో గాలింపు జరపగా.. కాలువలో మనిషికి సంబంధించిన ఎముకలు దొరికాయి. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపిస్తాం. ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతుంది’’ అని పోలీసులు వెల్లడించారు. అంతకుముందు ఎంపీ శరీరానికి సంబంధించినవిగా భావిస్తోన్న దాదాపు మూడున్నర కిలోల మాంసపు ముద్దను హత్య జరిగిన అపార్టుమెంటు సెప్టిక్‌ ట్యాంకులోనే గుర్తించారు. బంగ్లా ఎంపీని హత్య చేసిన అనంతరం అతడి శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీటిలో కొన్ని ఇప్పటికే లభ్యం చేసుకున్నప్పటికీ.. అవి నిర్ధరించుకోవడం కష్టంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఎంపీ కుమార్తె బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతాకు రానున్నారు. మరోవైపు, ఈ హత్య కోసం ఎంపీ సన్నిహితుడే నిందితులకు దాదాపు రూ.5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని