గుజరాత్‌ తీరంలో మాదకద్రవ్యాల పట్టివేత

గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో సముద్రతీరాన నిషేధిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సరకు  విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.16 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Updated : 10 Jun 2024 12:40 IST

విలువ రూ.16 కోట్లు ఉంటుందని అంచనా

దేవభూమి ద్వారకా: గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో సముద్రతీరాన నిషేధిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సరకు  విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.16 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ‘‘స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసుల బృందం (ఎస్‌వోజీ) రెండు రోజుల క్రితం సముద్ర తీరం వెంబడి గస్తీ తిరుగుతుండగా మూడు ప్లాస్టిక్‌ సంచులు కనిపించాయి. అందులో 30 ప్యాకెట్లలో 32 కేజీల చరాస్‌ ఉంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.16 కోట్లు ఉండొచ్చు’’ అని జిల్లా ఎస్పీ ఆదివారం తెలిపారు. ఈ సంచులు సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని