గొర్రెల పథకం నిందితులను విచారిస్తున్న అనిశా

గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ(అనిశా) దర్యాప్తు వేగం పెంచింది.

Published : 11 Jun 2024 05:27 IST

ఈనాడు, హైదరాబాద్‌-చంచల్‌గూడ, న్యూస్‌టుడే: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ(అనిశా) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ సీఈవో రాంచంద్రనాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను కస్టడీ విచారణకు అనిశా న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అనిశా అధికారులు వారిని సోమవారం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీరిద్దరిని మూడు రోజులపాటు విచారించనున్నారు. ఈ కేసులో అనిశా ఇప్పటి వరకూ 10 మందికిపైగా నిందితులను అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని