పొరుగింటి వ్యక్తితో వివాదం.. నిద్రిస్తున్నవారిపై కాల్పులు

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరుల ప్రాణాలను బలితీసుకుంది.

Published : 28 Nov 2022 04:23 IST

ముగ్గురు సోదరుల మృతి

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరుల ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిక్రోరాకు చెందిన సమందర్‌.. పొరుగింటి వ్యక్తి లఖన్‌తో నవంబరు 24న గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సమందర్‌ కుటుంబంపై లఖన్‌ కోపం పెంచుకున్నాడు. తన అనుచరులతో కలిసి సమందర్‌ కుటుంబంపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో సమందర్‌ సహా అతడి ఇద్దరు సోదరులు మరణించారు. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబం నిద్రిస్తున్న సమయంలో నిందితుడు ఈ కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని