రోడ్డుపై మహిళ రీల్స్‌.. బైక్‌పై వచ్చి మెడలో గొలుసు చోరీ

రోడ్డుపై రీల్స్‌ చేస్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

Updated : 30 Mar 2024 14:41 IST

ఘజియాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం కొంతమంది వినూత్నంగా కంటెంట్ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, షాపింగ్‌ మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో రీల్స్‌ చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోడ్డుపై రీల్స్‌ చేస్తున్న మహిళ మెడలోంచి గొలుసు చోరీకి గురైంది. దీంతో అవాక్కైన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఘజియాబాద్‌లోని ఇంద్రాపుర్‌ ప్రాంతానికి చెందిన సుష్మా అనే మహిళ రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. ఆదివారం ఉదయం రహదారి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డులో రీల్స్‌ చేస్తూ..కెమెరా వైపు నడుచుకుంటూ వస్తోంది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రీల్స్‌ మోజులో పడి విలువైన వస్తువు పోగొట్టుకుంది’, ‘దొంగ గొలుసు లాక్కెళుతుంటే ప్రతిఘటించేందుకు ప్రయత్నించలేదు’ అని కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు