తూప్రాన్‌లో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరి మృతి

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

Updated : 04 Dec 2023 12:53 IST

తూప్రాన్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో వాయుసేన శిక్షణ విమానం కూలింది. సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇది కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కూలిన శిక్షణ విమానంలో మంటలు చెలరేగడంతో ఇద్దరు పైలట్లు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రమాదానికి గురైన దానిని పిలాటియస్‌ పీసీ 7 ఎంకేII శ్రేణి శిక్షణ విమానంగా గుర్తించారు. ఇది మెదక్‌ జిల్లాలోని వాయుసేన కేంద్రం నుంచి సాధారణ శిక్షణ నిమిత్తం గాల్లోకి ఎగిరింది. ఈ విషయాన్ని వాయుసేన ధ్రువీకరించింది. ‘‘నేటి ఉదయం పిలాటియస్‌ పీసీ 7 ఎంకేII విమానం ట్రెయినింగ్‌ సార్టీల సందర్భంగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు’’ అని వాయుసేన ట్విటర్‌లో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో శిక్షకుడు, ట్రైయినీ ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని