Warangal: బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ చేతివాటం.. రూ.8.65 కోట్ల బురిడీ

నర్సంపేటలో ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ చేతివాటం ప్రదర్శించి.. రూ.8.65కోట్ల మేర బురిడీ కొట్టించాడు.

Published : 12 Sep 2023 15:38 IST

నర్సంపేట: వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ బైరిశెట్టి కార్తీక్‌ చేతివాటం ప్రదర్శించాడు. తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే... బ్యాంకులోని బంగారు రుణాల విభాగంలో కార్తీక్‌ పని చేస్తున్నాడు. ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. ఆడిటింగ్‌ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. కొల్లగొట్టిన సొమ్మును క్రికెట్‌ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.  నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... అతడిని రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని