Crime News: ఐఎన్‌ఎల్‌డీ నేత నఫే సింగ్‌ రాఠీ హత్య

ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (INLD) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్‌ రాఠీ హత్యకు గురయ్యారు.

Updated : 25 Feb 2024 20:50 IST

చండీగఢ్‌: హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (INLD) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్‌ రాఠీ హత్యకు గురయ్యారు. ఆయనతోపాటు మరో అనుచరుడు మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం తన కారులో వెళ్తోన్న నఫేని వెంబడించిన గుర్తుతెలియని దుండగులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఝజ్జర్‌ జిల్లాలోని బహదుర్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది.

మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్‌ రాఠీ.. ఆదివారం సాయంత్రం తన ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో మరో కారులో వచ్చిన కొందరు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అక్కడున్న స్థానికులు, ఆయన సిబ్బంది, వెంటనే రాఠీని స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధరించారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. అనేక బృందాలతో నిందుతుల కోసం గాలింపు చేపట్టారు. పక్కా ప్రణాళికతోనే దుండగులు ఈ దాడికి దిగినట్లు అనుమానిస్తున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్‌ చౌతాలా ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు