chigurupati jayaram: చిగురుపాటి జయరాం హత్య కేసు.. రాకేశ్‌ని దోషిగా తేల్చిన కోర్టు

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాకేశ్‌రెడ్డిని దోషిగా తేల్చుతూ తీర్పు వెల్లడించిన కోర్టు.. ఆయనకు ఈనెల 9న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

Updated : 24 Mar 2023 15:21 IST

హైదరాబాద్‌: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాకేశ్‌రెడ్డిని దోషిగా నిర్ధారించింది. ఆయనకు ఈనెల 9న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. హత్య కేసులో 11 మందిని నిర్దోషులుగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల 23 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 73 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. హనీట్రాప్‌తో జయరాం హత్యకు కుట్రపన్నిన రాకేశ్‌రెడ్డి... జయరాంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను ఛార్జిషీట్‌లో జతపరిచారు. 

ఏం జరిగిందంటే..?

2019 జనవరి 31న జయరాం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్యను రాకేశ్‌ తన స్నేహితులతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు. డబ్బుల వ్యవహారంలోనే రాకేశ్‌ హత్యకు పాల్పడ్డారని 2019 మేలో పోలీసులు నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసుపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ కొనసాగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని