Khammam: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం విద్యార్థి వరుణ్‌రాజ్‌ (29) మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated : 08 Nov 2023 11:04 IST

ఖమ్మం: అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం విద్యార్థి వరుణ్‌రాజ్‌ (29) మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వరుణ్‌ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి.

ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్‌ ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. అక్టోబర్‌ 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో వరుణ్‌ కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వరుణ్‌ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని