Macherla: మాచర్లలో ఆగని వైకాపా ఆగడాలు.. మహిళపై కత్తితో దాడి

పల్నాడు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి.

Updated : 26 May 2024 20:32 IST

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. పట్టణంలోని 22వ వార్డులో వైకాపాకి చెందిన ఉప్పుతోళ్ల వెంకేటశ్‌.. నీలావతి అనే మహిళపై కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలింగ్‌ ముగిసిన నాటి నుంచి వెంకటేశ్‌ వీధుల్లో కత్తిపట్టుకొని తిరుగుతూ తెదేపా నాయకులు వార్డులో కనిపిస్తే చంపేస్తానంటూ వీరంగం సృష్టిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదే క్రమంలో శనివారం సైతం స్థానికులతో గొడవ పడగా.. వారించే ప్రయత్నం చేసిన నీలావతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వైకాపానేత తురక కిషోర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్‌పై 10కి పైగా కేసులు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజు పీడబ్ల్యూడీ కాలనీ, పాల్వాయి గేటు, ఆ మరుసటి రోజు కారంపూడి అల్లర్లు, దాడుల్లోనూ వెంకటేష్ పాల్గొన్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు