Tirupati: తిరుపతి జూలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి

తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. 

Updated : 15 Feb 2024 17:26 IST

తిరుపతి: తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి చేసిన సింహాన్ని జంతుప్రదర్శనశాల అధికారులు బోన్‌లో బంధించారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్టు విచారణలో తేలింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జార్‌ (38)గా గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు