Crime news: లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 27 Feb 2024 15:06 IST

హైదరాబాద్‌: లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. దుండిగల్‌లోని ఓ కళాశాలలో మనోజ్‌ బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఓ లోన్‌ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తానికి సక్రమంగా ఈఎంఐ చెల్లించలేదు. దాంతో యాప్‌ ఏజెంట్లు విద్యార్థి బంధువులకు ఫోన్‌ చేసి డబ్బులు అడిగారు. విషయం అందరికీ తెలిసిందని మనస్తాపం చెందిన మనోజ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని