Bapatla: రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

బాపట్ల మండలం ఈతేరు- చుందూరుపల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ గోపిరెడ్డి (30) మృతి చెందారు.

Published : 03 Mar 2024 16:32 IST

బాపట్ల: రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ గోపిరెడ్డి (30) మృతి చెందాడు. బాపట్ల మండలం ఈతేరు- చుందూరుపల్లి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. బాపట్లలోని ఉప్పెరపాలెంకు చెందిన గోపిరెడ్డి 2018లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ద్విచక్రవాహనంపై బాపట్ల వస్తుండగా లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో.. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక నుంచి లారీ, ఆపై ముందు నుంచి బస్సు ఢీ కొట్టాయి. తలకు తీవ్రగాయాలు కావడంతో గోపిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని