Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది.

Published : 25 Apr 2024 12:16 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై దర్యాప్తు బృందం సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఐటీ యాక్ట్‌ 66(ఎఫ్‌)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. 

ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిలు పిటిషన్‌పై వాదనలు బుధవారం పూర్తయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండులో ఉన్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు.. తమకు బెయిలు మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టగా.. పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని