Khammam: ఆస్తి తగాదా.. కుమార్తె, అల్లుడిపై గడ్డపారలతో దాడి

ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుమార్తె, అల్లుడిపై గడ్డపారలతో దాడి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా..

Updated : 10 Nov 2023 16:18 IST

వైరా (ఈటీవీ): ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుమార్తె, అల్లుడిపై గడ్డపారలతో దాడి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా.. అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది. 

వైరా ఎస్సై మేడా ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం తాడిపూడి గ్రామానికి చెందిన రాములు.. అదే గ్రామానికి చెందిన అల్లుడు రామకృష్ణ, కుమార్తె ఉషపై శుక్రవారం ఉదయం దాడి చేశాడు. దీంతో ఉష (28) ఘటనాస్థలంలోనే మృతిచెందింది. రామకృష్ణ తీవ్రంగా గాయపడటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు రాములు పరారీలో ఉన్నట్లు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని