UP Murder: ప్రియురాలిని చంపి.. మృతదేహాన్ని నీళ్ల ట్యాంకులో దాచి..!
ఉత్తర్‌ప్రదేశ్ దారుణం జరిగింది. ఓ యువతి పట్ల ప్రేమించిన వాడే మృత్యువుగా మారాడు. ఆమెను చంపి మృతదేహాన్ని రెండు వారాలుగా నీళ్ల ట్యాంక్‌లో దాచిపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని చంపేసిన (Murder) ఓ వ్యక్తి ఆమె మృతదేహాన్ని నీళ్ల ట్యాంకులో దాచాడు. ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (Man kills lover)
మహేవా ప్రాంతానికి చెందిన రాజ్ కేసర్ (35) మే 30న అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫోన్‌కాల్ వివరాల ఆధారంగా ప్రియుడు అరవింద్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసర్‌ను 15 రోజుల కిందటే హత్య చేసిన అరవింద్.. ఆమె మృతదేహాన్ని తమ నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద నీళ్ల ట్యాంక్‌లో దాచిపెట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని ట్యాంక్ నుంచి బయటకు తీశారు. అనంతరం శవపరిక్షకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అరవింద్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ హత్య ఎందుకు చేశాడన్నది ఇంకా తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
China: సముద్ర ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55 మంది సబ్‌మెరైనర్ల మృతి..!
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు