Crime News: ఫోన్‌లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిని చంపిన తండ్రి

ఫోన్‌లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు.

Updated : 27 Mar 2024 12:44 IST

నాగ్‌పుర్‌: ఫోన్‌లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిప్రా గ్రామంలో కక్డే అనే వ్యక్తి బిగ్గరగా ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అతడి కుమారుడు సూరజ్‌(28) నెమ్మదిగా మాట్లాడాలని సూచించాడు. ఈ విషయమై వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో తండ్రి కుమారుడిపై  రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఈ ఘటన జరిగినప్పుడు తండ్రీకొడుకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని