Karnataka High Court: కోర్టు హాల్లో ఆత్మహత్యాయత్నం.. సీజే కళ్ల ముందే ఘటన

కర్ణాటక హైకోర్టులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారణం ఇంకా తెలియరాలేదు.

Published : 03 Apr 2024 22:02 IST

బెంగళూరు: కర్ణాటక హైకోర్టులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ప్రధాన న్యాయమూర్తి ఎదుటే కత్తితో గొంతు కోసుకోవడంతో కోర్టు ప్రాంగణంలో అలజడి నెలకొంది. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణం తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరుకు చెందిన శ్రీనివాస్‌.. బుధవారం కోర్టు హాల్లోకి ప్రవేశిస్తూనే సెక్యూరిటీ సిబ్బందికి ఓ ఫైల్‌ను అందజేశాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విపిన్‌ చంద్ర అంజరియా కళ్ల ముందే కత్తితో గొంతు కోసుకున్నాడు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

అతడు ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడనే దానిపై స్పష్టత రాలేదు. అతడి వద్ద ఎలాంటి నోట్‌ కూడా దొరకలేదని పోలీసులు తెలిపారు. కోర్టులో భద్రతా వైఫల్యంపై సీజే అసహనం వ్యక్తం చేశారు. కోర్టు భవనంలోకి ఆయుధాన్ని ఎలా తీసుకురాగలిగాడని పోలీసులను ప్రశ్నించారు. ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. శ్రీనివాస్‌ తీసుకొచ్చిన ఫైల్లో ఏమున్నది కూడా తెలియరాలేదు. కోర్టు అనుమతి లేకుండా ఆ డాక్యుమెంట్లు చూడొద్దని అధికారులకు న్యాయస్థానం సూచించింది. ఆరోగ్యం మెరుగుపడ్డాక పోలీసులు అతడి నుంచి వాంగ్మూలం నమోదు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని