Mizoram: గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది మృతి

మిజోరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐజ్వాల్‌ జిల్లాలో గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతి చెందారు.

Updated : 28 May 2024 11:24 IST

ఐజ్వాల్‌: మిజోరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐజ్వాల్‌ జిల్లాలో గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది.

మరోవైపు భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలతో ఐజ్వాల్‌లో పాఠశాలలను మూసివేశారు. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో.. ఐజ్వాల్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మరో రెండ్రోజులు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని