CRPF: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు జవాన్లు మృతి!

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.

Updated : 30 Jan 2024 20:40 IST

రాయ్‌పుర్‌: భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) సుక్మా జిల్లాలోని టేకులగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్‌ ‘కోబ్రా’ దళం, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, జిల్లా రిజర్వ్‌ బృందాలు కలిసి స్థానికంగా కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపు సమీపంలో మంగళవారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో నిరంతర గాలింపు

ఈ ఘటనలో ‘కోబ్రా’ 201వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు, సీఆర్పీఎఫ్‌ 150వ బెటాలియన్‌ చెందిన ఒక జవాన్‌ మృతి చెందినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. మరో 14 మంది గాయపడినట్లు తెలిపారు. కమాండోలు దాడిని తిప్పికొట్టడంతో మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి పారిపోయినట్లు చెప్పారు. 2021లో ఇదే టేకులగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని