Hyderabad: గన్‌మెన్ల కోసమే.. భాజపా నేత కత్తులతో దాడి డ్రామా!

భాజపా నేత ఉదయ్‌ భాస్కర్‌ గౌడ్‌పై కత్తులతో దాడి కేసు మలుపు తిరిగింది.

Updated : 29 Feb 2024 22:29 IST

హైదరాబాద్: భాజపా నేత ఉదయ్‌ భాస్కర్‌ గౌడ్‌పై కత్తులతో దాడి కేసు మలుపు తిరిగింది. కేసు విచారణలో కొత్త విషయాలు బయటకొచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ్ భాస్కర్.. గతంలో తనపై క్రిమినల్‌ కేసులు ఉండటంతో గన్‌మెన్ల కోసం తన మీద తానే హత్యాయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత దాడి జరిగిందంటూ ఉప్పల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిజం నిగ్గు తేల్చారు. నిందితుడు భాస్కర్‌గౌడ్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు. 

‘‘భాస్కర్‌గౌడ్‌ బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. పలుకుబడి కోసం మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు. గన్‌మెన్లు ఉంటే సమాజం గౌరవిస్తుందన్న దురుద్దేశంతో ఈ ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్‌లో ఈ ఘటన జరిగింది. ఇందుకోసం రూ.2.50 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆయనపై జంట నగరాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. మర్డర్ ప్లాన్‌కు సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించాం. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు’’ అని డీసీపీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని