Kakinada: పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌.. ఇద్దరి మృతి

ఖాళీగా ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 01 Apr 2024 13:30 IST

శంఖవరం: ఖాళీగా ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. శంఖవరం మండలం కత్తిపూడి శివారుకు మరమ్మతుల కోసం దాన్ని తీసుకొచ్చారు. వెల్డింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా ట్యాంకర్‌ పేలింది. ఈ ఘటనలో కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్‌ (38), బూరా సోమరాజు (39) మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వేడి తీవ్రతకు ట్యాంకర్‌ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబీకులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని